News September 9, 2024
బుడమేరుకు ఏ క్షణమైనా వరద.. కమిషనర్ కీలక ఆదేశాలు

AP: విజయవాడను మరోసారి వరద ముప్పు ఆందోళనకు గురిచేస్తోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో బుడమేరు పరివాహ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందన్నారు.
Similar News
News January 24, 2026
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గుడోలు

TG: గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం కాబోతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్పై తొలిసారి మన ఒగ్గుడోలు కళను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి నేతృత్వంలోని 30 మంది బృందం ఈ చారిత్రక అవకాశం దక్కించుకుంది. ఢిల్లీలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా 15 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటనున్నారు.
News January 24, 2026
దీర్ఘాయుష్షుకు 5 నిమిషాల ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చాలు!

ఆయుష్షు పెంచుకోవడానికి గంటల తరబడి శ్రమించక్కర్లేదు. రోజుకు కేవలం 5 నిమిషాలు ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేసినా లేదా 30 నిమిషాలు కూర్చునే సమయం తగ్గించినా ఆయుర్దాయం పెరుగుతుందని ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన తాజా స్టడీ వెల్లడించింది. మంచి నిద్ర, పోషకాహారం, తక్కువ ఒత్తిడి, స్మోకింగ్, డ్రింకింగ్కి దూరంగా ఉండడం వంటి మార్పులు తోడైతే దీర్ఘాయువు మీ సొంతం. రోజూ కాసేపు వేగంగా నడిచినా ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లే.
News January 24, 2026
విష్ణుమూర్తికి నైవేద్యం ఏ పాత్రలో పెట్టాలి?

విష్ణువుకు నైవేద్యం సమర్పించడానికి రాగి పాత్ర శ్రేష్టం. పూర్వం విష్ణు భక్తుడైన గుడాకేశుడు తన శరీరం లోహంగా మారాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహంతో రాగిగా మారాడు. తన భక్తుని శరీర రూపమైన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణువుకు ప్రీతికరం. శాస్త్రీయంగా కూడా రాగికి బ్యాక్టీరియాను నశింపజేసే గుణం, రోగనిరోధక శక్తిని పెంచే స్వభావం ఉంది. అందుకే దేవాలయాల్లో రాగి పాత్రల్లోనే తీర్థం ఇస్తుంటారు.


