News September 4, 2024

వారాంతంలోగా వరద నష్టం వివరాలివ్వాలి: CS

image

TG: భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్రస్థాయిలోకి వెంటనే పంపించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు ప్రతీ జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలన్నారు.

Similar News

News November 7, 2025

లెస్బియన్ అఫైర్.. 6 నెలల బిడ్డను చంపిన తల్లి?

image

తన భార్య మరో మహిళతో అఫైర్ పెట్టుకుని 6 నెలల బిడ్డను చంపి ఉండొచ్చని తండ్రి ఆరోపించారు. తమిళనాడు కృష్ణగిరి(D)లో ఈ ఘటన జరిగింది. కొన్ని రోజుల కిందట బేబీ మరణించగా, అనారోగ్యమే కారణమనుకుని పోస్టుమార్టం చేయకుండానే పూడ్చిపెట్టారు. తాజాగా భార్య ఫోన్‌లో లెస్బియన్ చాటింగ్‌ను గుర్తించిన భర్త.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇవాళ బేబీ బాడీకి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

News November 7, 2025

న్యూస్ అప్‌డేట్స్ @10AM

image

*గన్నవరం చేరుకున్న ప్రపంచకప్ ఛాంపియన్ క్రికెటర్ శ్రీచరణి. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో భేటీ
*BRS ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు. ఎలక్షన్ కోడ్ అమల్లో లేని ప్రాంతంలో రైడ్స్ ఏంటని రవీందర్ రావు ఆగ్రహం
*ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య.. 100కు పైగా ఫ్లైట్లు ఆలస్యం

News November 7, 2025

నాకు విజయ్‌తో శత్రుత్వం లేదు: అజిత్

image

కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్‌పై హీరో అజిత్ అసహనం వ్యక్తం చేశారు. దళపతి విజయ్‌తో తనకు వైరం ఉందనే ప్రచారాన్ని ఖండించారు. ‘కొందరు నాకు, విజయ్‌కు శత్రుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. వీటిని చూసి అభిమానులు గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు సృష్టించే వారు మౌనంగా ఉండటం మంచిది. నేనెప్పుడు <<18165294>>విజయ్ మంచినే<<>> కోరుకుంటా’ అని స్పష్టం చేశారు. కరూర్ తొక్కిసలాటకు అందరూ బాధ్యులేనని అజిత్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.