News November 1, 2024

వరదల కల్లోలం.. 158 మంది దుర్మరణం

image

స్పెయిన్‌లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఇప్పటి వరకు 158 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వాలెన్సియా సిటీలోని 155 మంది మృత్యువాత పడినట్లు తెలిపారు. వరదల తర్వాత పరిస్థితి భయానకంగా ఉంది. కొట్టుకుపోయిన వాహనాల్లోనే మృతదేహాలు బయటపడుతున్నాయి. భారీ వృక్షాలు నేలకూలగా విద్యుత్ లైన్లు, రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.

Similar News

News November 16, 2024

IIT మద్రాసుతో 8 ఒప్పందాలు: మంత్రి లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం IIT మద్రాసుతో 8 రకాల ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. CRDA, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్‌మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్, ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్, IT, RTGS శాఖలతో IIT మద్రాస్ ఒప్పందాలు కుదిరాయని ఆయన అన్నారు. ఐఐటి మద్రాసు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించిన అనంతరం కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.

News November 16, 2024

మిలిటరీ హెలికాప్టర్‌లో బ్రిటిష్ సైనికుల శృంగారం!

image

UKలోని సైనిక శిక్షణా ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు హద్దులు దాటారు. రూ.75 కోట్ల మిలిటరీ హెలికాప్టర్‌ కాక్‌పిట్‌లో శృంగారం చేస్తూ దొరికిపోయారు. ఇద్దరూ మద్యం తాగినట్లు అధికారులు గుర్తించారు. అర్ధనగ్నంగా ఉన్న వారికి వెంటనే దుస్తులు ధరించాలని సూచించారు. పురుషుడు ఆర్మీ యూనిఫాంలో ఉండగా మహిళ మాత్రం సాధారణ దుస్తుల్లో ఉన్నారు. అయితే ఈ సంఘటన 2016లో జరిగిందని, ఇప్పుడు వైరలవుతోందని ‘ది సన్’ పేర్కొంది.

News November 16, 2024

టీమ్ ఇండియాకు షాక్.. కోహ్లీకి గాయం?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందే టీమ్ ఇండియాను గాయాల బెడద వేధిస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఆయనను స్కానింగ్‌కు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా మోచేతి గాయాల బారిన పడ్డట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరు అందుబాటులో లేకపోయినా భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.