News March 27, 2024

వడగాడ్పుల హెచ్చరికలు.. రాష్ట్రాలకు ఈసీ కీలక సూచనలు

image

మార్చి-జూన్ మధ్య వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో ఈసీ అప్రమత్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, సరైన నీడ, మెడికల్ కిట్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలంది. సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, పోలింగ్ ఏజెంట్లకు ఫర్నీచర్‌‌తో పాటు ప్రత్యేక టాయిలెట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Similar News

News January 16, 2026

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైమ్ పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వేంకటేశ్వరుడిని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.80కోట్లు ఆదాయం వచ్చిందని TTD ప్రకటించింది.

News January 16, 2026

ఇరాన్ వీధుల్లో అద్దె సైనికులు

image

ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలను అణిచివేయడానికి ఖమేనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయ భద్రతా బలగాలపై నమ్మకం తగ్గడంతో ఇరాక్ నుంచి కిరాయికి యువకులను రప్పించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యాత్రికుల ముసుగులో వీరంతా ఇరాన్‌లోకి చొరబడుతున్నారని, అనంతరం నిరసనకారులపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హెజ్బొల్లా గ్రూప్ వంటి వారు ఇందులో ఉన్నట్లు సమాచారం.

News January 16, 2026

NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>NTPC<<>>లో 6 అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CLAT-2026 పీజీలో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/