News July 8, 2024

అస్సాంలో వరదలు.. 72 మంది మృతి

image

అస్సాంలో భారీ వర్షాల ధాటికి వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల్లో తాజాగా మరో ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 72కి చేరింది. మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. కజిరంగ నేషనల్ పార్కులో దాదాపు 131 జంతువులు మృత్యువాత పడ్డాయి. కాగా ఆ రాష్ట్రంలో సహాయక చర్యలను సీఎం హిమంత బిశ్వశర్మ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News January 18, 2026

ట్రంప్ మోసం చేశాడు: ఇరాన్ నిరసనకారులు

image

US అధ్యక్షుడు ట్రంప్ తమకు ద్రోహం చేశారని ఇరాన్‌ నిరసనకారులు మండిపడుతున్నారు. దాడికి సిద్ధంగా ఉన్నామని, సాయం త్వరలోనే అందుతుందని చెప్పి ఇప్పుడు పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ప్రభుత్వం తమను అణచివేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ‘దేశంలో 15 వేల మంది మరణానికి ట్రంప్ కారణం. మమ్మల్ని ఆయుధాలుగా వాడుకుని మోసం చేశారు. ఖమేనీ ప్రభుత్వంతో డీల్ చేసుకున్నారు’ అని ఆరోపిస్తున్నారు.

News January 18, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News January 18, 2026

గిరిజన సంస్కృతికి నిలువుటద్దం ‘నాగోబా జాతర’

image

ADB(D) కేస్లాపూర్(V)లో గిరిజనులు నాగోబా జాతరను అత్యంత భక్తితో జరుపుకొంటారు. పుష్యమాస అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవం నాగోబా నాట్యం చేస్తాడని మెస్రం వంశీయుల నమ్మకం. ఈ పండుగ కోసం గిరిజనులు 100km నడిచి గోదావరి జలాన్ని కలశాల్లో తెస్తారు. అమావాస్య అర్థరాత్రి ఆ పవిత్ర జలంతో స్వామికి అభిషేకం చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది తరలివస్తారు.