News June 19, 2024

అస్సాంలో వరదలు.. 30 దాటిన మృతుల సంఖ్య

image

అస్సాంలో వరదలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 దాటింది. మంగళవారం రాత్రి గైనచోరా గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మృతిచెందారు. రెమాల్ తుఫాను కారణంగా గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు 470 గ్రామాలు నీటమునిగాయి. 15 జిల్లాల్లోని 1.61లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. రిలీఫ్ క్యాంపుల్లో 5114 మంది తలదాచుకున్నారని, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News November 22, 2025

వంటింటి చిట్కాలు

image

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
– ఫ్రిజ్‌లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్‌‌‌లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.

News November 22, 2025

క్షమాపణలు చెప్పిన అల్‌-ఫలాహ్‌ వర్సిటీ

image

ఢిల్లీ పేలుడు ఘటనలో అల్‌-ఫలాహ్‌ వర్సిటీ పేరు రావడంతో, వారి వెబ్‌సైట్‌లో ఉన్న పాత అక్రిడిటేషన్‌ వివరాలపై NAAC షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వర్సిటీ స్పందిస్తూ వెబ్‌సైట్ డిజైన్‌ లోపాలు కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని క్షమాపణలు తెలిపింది. తప్పుడు సమాచారాన్ని తొలగించినట్లు పేర్కొంది. కాగా గడువు ముగిసిన తరువాత కూడా వర్సిటీ గ్రేడ్‌లను తమ సైట్‌లో కొనసాగిస్తూ వచ్చింది.