News July 15, 2024
HYDలో వరదలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్పై BJP విమర్శలు

వర్షం, వరదల కారణంగా HYD వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీ బీజేపీ ట్వీట్ చేసింది. గత పాలనలో జరిగిన లోపాల నుంచి నేర్చుకుని, సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ‘ఇదేనా KTR.. నీటి బుడగల మీద నువ్వు కట్టిన విశ్వనగరం? ఇదేనా రేవంత్.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతున్న ప్రజలకి నువ్విచ్చే భరోసా?’ అంటూ రోడ్లపై వరద పారుతున్న వీడియోను Xలో పోస్ట్ చేసింది.
Similar News
News November 7, 2025
జ్ఞానాన్ని అందించే గురువే విష్ణు దేవుడు

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిస్ఠాయ నమో నమః ||
ఈ శ్లోకం విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి, జ్ఞానానికి నిలయమైన విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేస్తుంది. మన జీవితంలో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించే గురువును విష్ణువుగా భావించి, గౌరవించాలి. అంకితభావంతో చదివితేనే ఉన్నతమైన వివేకం లభిస్తుందని దీని సారాంశం.
<<-se>>#VISHNUSAHASRASASOURABHAM<<>>
News November 7, 2025
విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.
News November 7, 2025
అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.


