News April 25, 2025

సిక్కింలో వరదలు.. చిక్కుకున్న 1000మంది టూరిస్టులు

image

సిక్కింను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రహదార్లు మూసుకుపోయి 1000మంది పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. కొండచరియల కారణంగా మున్షితాంగ్, లాచుంగ్ చుంగ్‌తాంగ్ రోడ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.

Similar News

News April 25, 2025

ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

image

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News April 25, 2025

OTTలోకి వచ్చేసిన కొత్త చిత్రాలు

image

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హిట్ అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ‘జ్యువెల్ థీఫ్’ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

News April 25, 2025

హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేసిన రాహుల్ గాంధీ?

image

అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేశారని స్పుత్నిక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కనిపెట్టిందని పేర్కొంది. ‘2023, మేలో హిండెన్‌బర్గ్‌కు సంబంధించిన వారితో కాలిఫోర్నియాలో రాహుల్ భేటీ అయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడైన శామ్ పిట్రోడా ఈ-మెయిల్స్‌ను హ్యాక్ చేయడం ద్వారా మొసాద్ ఈ సంగతి గుర్తించింది’ అని తెలిపింది.

error: Content is protected !!