News May 19, 2024

అఫ్గానిస్థాన్‌ను వణికిస్తున్న వరదలు.. 68 మంది మృతి

image

అఫ్గానిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా వరదల్లో చిక్కుకుని పశ్చిమ ప్రావిన్స్ ఘోర్‌లో 50 మంది, ఉత్తర ప్రావిన్స్ ఫరయాబ్‌లో 18 మంది చనిపోయినట్లు తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో భారీ వర్షాల కారణంగా 300 మందికి పైగా మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. చాలా ప్రాంతాలకు ఆహారాన్ని ట్రక్కుల ద్వారా చేరవేయలేకపోతున్నామంది.

Similar News

News December 23, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగజెఱువు నిండిన
గప్పలు పదివేలుజేరుగదరా సుమతీ!
తాత్పర్యం: చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలకొద్దీ కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అలాగే మనకు ఎప్పుడైతే సంపద చేకూరుతుందో అప్పుడు బంధువులు వస్తారు.

News December 23, 2024

ఆ ముగ్గురితో సినిమాలు చేయాలనుకున్నా కుదరలేదు: శంకర్

image

ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడి మధ్య ఘర్షణ కథాంశంతో గేమ్ ఛేంజర్ రూపొందించినట్లు డైరెక్టర్ శంకర్ చెప్పారు. రామ్ చరణ్ నటన సెటిల్డ్‌గా ఉందని, కాలేజీ లుక్‌లో ఫైర్ ఉంటుందని డల్లాస్ ఈవెంట్‌లో తెలిపారు. తెలుగులో చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌తో సినిమాలు చేయాలనుకున్నప్పటికీ కుదరలేదన్నారు. చెర్రీతో మూవీ చేయాలని రాసిపెట్టి ఉందని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

News December 23, 2024

నేనింకా బతికే ఉన్నా: కింగ్ చార్లెస్-3

image

క్యాన్సర్ నుంచి కోలుకున్న బ్రిటన్ రాజు చార్లెస్-3 తాజాగా పలువురు సాధారణ పౌరులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవల సిబ్బంది, వాలంటీర్లు, వివిధ వర్గాల ప్రముఖులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘రాజు గారు మీరు ఎలా ఉన్నారు?’ అని భారత సంతతికి చెందిన సిక్కు ప్రతినిధి హర్విందర్ అడిగారు. దీనికి చార్లెస్ స్పందిస్తూ తానింకా బతికే ఉన్నానని సరదాగా చెప్పడంతో అందరూ చిరునవ్వు చిందించారు.