News July 4, 2024

ఎన్నోసార్లు టాయిలెట్స్ కడిగా: Nvidia CEO

image

ఏ పనినీ చిన్నచూపు చూడకూడదని ఎన్‌విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సూచించారు. పని విలువను గుర్తించినప్పుడే ఎదుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ‘నా కెరీర్ ఆరంభంలో ఓ టిఫిన్‌ సెంటర్‌లో పనిచేశాను. అక్కడ గిన్నెలు శుభ్రం చేసేవాడిని. అనేకసార్లు టాయిలెట్లు కూడా కడిగాను. చేసే పనిని ఎప్పుడూ గౌరవించాలి. అప్పుడు ఆ విషయాన్ని నేర్చుకోవడం వలనే నేడు ఏ పనిలో ఉన్నవారినైనా గౌరవించగలుగుతున్నా’ అని వివరించారు.

Similar News

News December 4, 2025

‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

image

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్‌లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్‌పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News December 4, 2025

పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో పెట్టకండి!

image

అధిక కాలం తాజాగా ఉంచడానికి చాలామంది ప్రతీ వస్తువును ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు.. డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, నూనెలు, కుంకుమ పువ్వు, బ్రెడ్, క్యారెట్, అల్లం, ముల్లంగి, బంగాళదుంపలు. ఒకవేళ తప్పకుండా ఫ్రిజ్‌లోనే పెట్టాలి అనుకుంటే గాజు జార్‌లో ఉంచడం బెస్ట్.

News December 4, 2025

ఎయిడ్స్ నియంత్రణలో APకి ఫస్ట్ ర్యాంక్

image

AP: HIV నియంత్రణ, బాధితులకు వైద్యసేవలందించడంలో AP దేశంలో తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిర్దేశిత 138 ప్రమాణాల్లో 105లో ఉత్తమ పనితీరు కనబరిచిందన్నారు. న్యాక్ త్రైమాసిక నివేదికలో రాష్ట్రం 2వ స్థానంలో ఉండగా అర్ధసంవత్సర ర్యాంకుల్లో ప్రథమ స్థానం సాధించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, సిబ్బందిని అభినందించారు.