News March 28, 2024

ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయ్!

image

హ్యారీ పోటర్ సిరీస్‌లో ఫ్లయింగ్ కార్లు గుర్తున్నాయా? అయితే.. అవి రియల్‌ లైఫ్‌లో నిజం కాబోతున్నాయి. స్లొవాకియన్ కంపెనీ అయిన క్లీన్ విజన్ ఈ ఎయిర్ కార్స్‌ను రూపొందించింది. తయారీ హక్కులను చైనాకు చెందిన హెబీ జియాన్‌క్సిన్ ఫ్లయింగ్ కార్ టెక్నాలజీ కంపెనీకి విక్రయించింది. 2028 నాటికి ఎగిరే ట్యాక్సీలు బ్రిటిష్ ఆకాశంలో తిరుగుతాయని UK ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటికే ఈ వార్త వచ్చింది.

Similar News

News January 30, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>బ్యాంక్<<>> ఆఫ్ బరోడా 23 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి FEB 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, ME/MTech/MCA కంప్యూటర్ సైన్స్/IT/E&C అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా, డిప్యూటీ మేనేజర్‌కు 35ఏళ్లు. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: bankofbaroda.bank.in

News January 30, 2026

T20 WC నుంచి బంగ్లా తప్పుకోవడం కరెక్ట్ కాదు: సురేశ్ రైనా

image

భద్రతా కారణాల దృష్ట్యా T20 WC నుంచి తప్పుకుంటూ BCB తీసుకున్న నిర్ణయాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తప్పుబట్టారు. ‘టోర్నీలో పాల్గొనడానికి బంగ్లా ఇండియాకు వస్తే బాగుండేది. ప్రస్తుతం ఆ జట్టు బలంగా ఉంది. ఇక్కడి పరిస్థితుల్లో ఎలా రాణించాలో స్పిన్నర్లకు తెలుసు. భారత్‌కు రాకూడదనే నిర్ణయంతో ఆర్థికంగా నష్టపోతారు. సాంస్కృతిక ఆహ్వానాన్ని బంగ్లా ప్లేయర్లు మిస్ అవుతారు’’ అని రైనా పేర్కొన్నారు.

News January 30, 2026

తులసి మొక్కలోని మార్పులు దేనికి సంకేతం?

image

తులసిని ఆ ఇంట్లోని స్థితిగతులకు సూచికగా కూడా నమ్ముతారు. నీళ్లు పోయకున్నా అది విపరీతంగా పెరిగితే అనర్థానికి సంకేతమట. పచ్చని మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఇంటి యజమాని ఆరోగ్యానికి/సంపదకు కీడు జరుగుతుందట. ఆకుల రంగు మారడాన్ని ప్రతికూల శక్తుల ప్రభావంగా పరిగణిస్తారు. అయితే తులసి మొక్కను నిత్యం భక్తితో పూజిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఆటంకాలు తొలగి, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్మకం.