News September 29, 2024
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు

TG: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌పాస్‌లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.
Similar News
News January 24, 2026
పొద చిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News January 24, 2026
పలాశ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు: స్మృతి ఫ్రెండ్

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ పలాశ్‌పై <<18931442>>ఫిర్యాదు<<>> చేసిన విజ్ఞాన్ మానే మరిన్ని ఆరోపణలు చేశారు. ‘ఆ రోజు పెళ్లి వేడుకలో నేను ఉన్నాను. అతను మరో యువతితో మంచంపై ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళా క్రికెటర్లు అతడిని చితకబాదారు’ అని ఆరోపించారు. దీనిపై పలాశ్ స్పందించారు. ‘ఇవన్నీ నా రెప్యుటేషన్ దెబ్బతీయాలని చేస్తున్న నిరాధార ఆరోపణలు. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటాను’ అని తెలిపారు.
News January 24, 2026
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.


