News May 19, 2024

మల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌పై దృష్టిపెట్టండి: కేటీఆర్

image

TG: హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్(MLCP) పనులు పూర్తి కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘2016/17లో నాంపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద PPP మోడ్‌లో ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాం. కొన్ని సమస్యలతో ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు పూర్తయ్యింది. కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 7, 2025

విశాఖపట్నం-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ECO రైల్వే అధికారులు విశాఖ-SMVT బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపారు. విశాఖ–SMVT బెంగళూరు స్పెషల్ విశాఖ నుంచి డిసెంబర్ 8న మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగుప్రయాణంలో బెంగళూరు నుంచి డిసెంబర్ 9న మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కి విశాఖ చేరుతుందన్నారు.

News December 7, 2025

నేటి ముఖ్యాంశాలు

image

✸ జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: సీఎం చంద్రబాబు
✸ TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి
✸ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి
✸ కొడుకు, అల్లుడు, బిడ్డే KCRను ముంచుతారు: రేవంత్
✸ రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల
✸ 95% ఫ్లైట్ కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో
✸ దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన టీమ్ ఇండియా

News December 7, 2025

రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

image

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్‌లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్‌లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.