News December 4, 2024
పార్టీ బలోపేతంపై ఫోకస్.. జగన్ కీలక సమావేశం

AP: వైసీపీ బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు, వైసీపీ బలోపేతం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ హామీల అమలు కోసం ఆందోళనలు చేపట్టడం సహా పలు అంశాలపై జగన్ చర్చిస్తున్నారు.
Similar News
News March 11, 2026
విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త సోహైల్‌తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించారు. అతడితో విడాకుల పక్రియ ఇవాళ పూర్తయింది. తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను హన్సిక 2022లో వివాహమాడారు. అయితే అతడికి అప్పటికే రింకీ బజాన్‌తో పెళ్లి జరగ్గా కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్, హన్సిక లవ్ మ్యారేజీ చేసుకున్నారు.
News March 11, 2026
స్టాక్ మార్కెట్లు క్రాష్

యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఫ్లాట్‌గా స్టార్ట్ అయిన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయాయి. సన్ ఫార్మా, ఎన్టీపీసీ మినహా అన్ని కంపెనీల షేర్లు ఘోర నష్టాలు చవిచూశాయి. FII అమ్మకాలు, ప్రాఫిట్ బుకింగ్, ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపించింది.
News March 11, 2026
యూజర్లకు షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్?

మొబైల్ డేటాపై ట్యాక్స్ విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని టెలికం విభాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇది ఆదాయం పెంచడంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆలోచిస్తుందట. ఒక GB డేటాపై ₹1 ట్యాక్స్ వేసినా ఏటా ₹22,900 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


