News March 19, 2025
వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.
Similar News
News March 19, 2025
ఘోరం.. భర్తను ముక్కలుగా నరికిన భార్య

యూపీ మీరట్‌లో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. లండన్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. ప్రియుడు మోహిత్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్‌ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు.
News March 19, 2025
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు

*1681- ముంబై ఇండియన్స్
*1649- ఆర్సీబీ
*1513- పంజాబ్ కింగ్స్
*1508- చెన్నై సూపర్ కింగ్స్
*1492- కేకేఆర్
*1348- ఢిల్లీ క్యాపిటల్స్
*1235- రాజస్థాన్
*1038- సన్‌రైజర్స్ హైదరాబాద్ *400- డెక్కన్ ఛార్జర్స్
*332- లక్నో *270- గుజరాత్ టైటాన్స్
News March 19, 2025
ఆ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పెంపు

AP: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర పశువైద్య యూనివర్సిటీ విద్యార్థులకు నెలవారీగా ఇచ్చే స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్స్‌కు రూ.7వేల నుంచి రూ.10,500కు, పీజీ విద్యార్థులకు రూ.9వేల నుంచి రూ.13,500కు, పీహెచ్‌డీ స్టూడెంట్లకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచింది.