News April 4, 2024
ఫుట్‌బాలర్ దారుణ హత్య

దక్షిణాఫ్రికా ఫుట్‌బాలర్ ల్యూకె ఫ్లెయర్స్ (24) దారుణ హత్యకు గురయ్యారు. జొహన్నెస్‌బర్గ్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద దుండగులు కాల్పులు జరపడంతో ల్యూకె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫ్లెయర్స్ హత్యపై పోలీసులు మర్డర్, కారు హైజాకింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లెయర్స్ టోక్యో ఒలింపిక్స్‌లో అండర్-23 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News November 24, 2025
‘భూ భారతి’లో భూముల మార్కెట్ విలువ!

TG: ‘భూ భారతి’ వెబ్సైట్లో భూముల మార్కెట్ విలువను తెలుసుకునేలా ప్రభుత్వం ఆప్షన్ తీసుకొచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కోసం అధికారిక వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లిష్‌లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. సర్వే నంబర్ ఉన్న ప్రతి ల్యాండ్ మార్కెట్ విలువ ఇందులో ఉంటుంది. ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్దేందుకు ‘భూ భారతి’ని తీసుకొచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 24, 2025
‘స్థానిక‘ స్థానాలన్నిట్లో పోటీకి BJP సన్నాహం!

TG: పార్టీని అన్ని స్థాయుల్లో బలోపేతం చేసేలా BJP సిద్ధమవుతోంది. స్థానిక ఎన్నిలను దీనికి అవకాశంగా భావిస్తోంది. పంచాయతీ, MPTC, ZPTC, GHMCల పరిధిలోని డివిజన్లు, వార్డులతో సహా అన్ని చోట్లా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు పార్టీ నాయకుడొకరు వివరించారు. ‘దీనివల్ల పార్టీకి ఓటు బ్యాంకు గతంలో కన్నా భారీగా పెరిగే అవకాశముంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగకున్నా కార్యకర్తలనే నిలబెడతాం’ అని తెలిపారు.
News November 24, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతిపై 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జేసీ వెంకటేశ్వర్లుకు నోటీసును అందజేశారు.
* డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు(D)లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.
* విజయనగరం(D)గుర్లలో స్టీల్‌ప్లాంట్ వద్దంటూ పలు గ్రామాల రైతులు ఆందోళనలు చేపట్టారు. ముందు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.


