News October 31, 2024
200 ఏళ్లుగా ఈ ఊళ్లో దీపావళి రోజున చీకట్లే
AP: శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పున్నానపాలెం 200 ఏళ్లుగా దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. అప్పట్లో పండుగ రోజే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. అదే రోజు రెండు ఎద్దులు కూడా మృత్యువాతపడ్డాయి. దీంతో గ్రామస్థులంతా తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో తమ ఊర్లో దీపావళి జరుపుకోకూడదని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి దీపావళికి ఆ గ్రామంలో దీపాలు కూడా వెలిగించరు.
Similar News
News November 17, 2024
ఆ రెండింటికి తేడా తెలియకుండానే ఐదేళ్లు పాలించారు: హోంమంత్రి
AP: YCP హయాంలో మహిళల అక్రమ రవాణా జరగలేదని <<14629630>>రోజా చేసిన ట్వీట్‌పై<<>> హోంమంత్రి అనిత స్పందించారు. ‘వ్యక్తిగత, మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్. ఉచ్చువేసి క్రయవిక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేస్తే అది హ్యుమన్ ట్రాఫికింగ్. ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత ఐదేళ్లు పాలించారు. అవినీతి తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం పట్టని ఇలాంటి వారు పరిపాలించడం ప్రజల పాలిట దౌర్భాగ్యం’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2024
నేడు, రేపు గ్రూప్-3 పరీక్షలు.. సూచనలివే!
TG: ఇవాళ, రేపు గ్రూప్-3 పరీక్షలు జరగనుండగా, అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది.
➤ఒరిజినల్ ఐడీతో పరీక్షకు రావాలి.
➤ఎగ్జామ్‌కు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
➤ఉ.9.30 తర్వాత, మ.2.30 తర్వాత పరీక్షకు అనుమతించరు.
➤అభ్యర్థులు పేపర్-1కు తీసుకొచ్చిన హాల్ టికెట్‌నే మిగతా పేపర్లకు తీసుకురావాలి.
➤నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ హాల్‌టికెట్, ప్రశ్న పత్రాల్ని భద్రంగా పెట్టుకోవాలి.
News November 17, 2024
రోహిత్‌తో ఆస్ట్రేలియాకు షమీ?
కొడుక్కి జన్మనిచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ BGT తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. అతడితో పాటు సీనియర్ పేసర్ షమీ కూడా AUSకు వెళ్తారని సమాచారం. రోహిత్ తొలి టెస్టుకు జట్టులో చేరుతారని, షమీని రెండో టెస్టుకు ముందు స్క్వాడ్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. BGT ఫస్ట్ టెస్ట్ ఈనెల 22 నుంచి జరగనుంది.