News March 14, 2025
రంగులు చల్లడం వద్దన్నందుకు..

రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. హన్సరాజ్(25) స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు హోలీ పేరుతో అతనిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించగా హన్స్రాజ్ వద్దని వారించాడు. దీంతో అతడిపై దాడి చేయగా మరణించాడు. కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News January 12, 2026
డీఏపై జీవో విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.
News January 12, 2026
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల

ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని <
News January 12, 2026
ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర ద్వారానే అమలవ్వాలి: కాటమనేని

AP: అంతరాయం లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు మనమిత్ర యాప్ ద్వారా వాటిని అమలు చేయాలని IT కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. ‘కొన్ని శాఖలు ఇప్పటికీ మాన్యువల్గా సేవలు కొనసాగిస్తున్నాయి. డేటా అనుసంధానం ప్రక్రియ పూర్తి చేసి యూజ్ కేసెస్ సిద్ధం చేస్తున్నాం. AI ఆధారితంగా ఉపయోగపడే 98 కేసెస్ను ఇప్పటికే సిద్ధం చేశాం. APR నాటికి పూర్తిగా వాటిని అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు.


