News February 4, 2025
EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం

TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.
Similar News
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం.. ఎంత పుణ్యమో తెలుసా?

వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకు సంబంధించి టికెట్లను TTD నిన్న విడుదల చేసింది. ☞ వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 28, 2025
‘ఫ్రైస్వాల్’ ప్రత్యేకత.. ఒక ఈతలో 4వేల లీటర్ల పాలు

హోలిస్టిన్ ఫ్రీజియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన హైబ్రీడ్ ఆవు ‘ఫ్రైస్వాల్’. ఇది ఒక ఈత కాలంలో 4 వేల లీటర్ల పాలను ఇస్తుంది. దీనిలో అధిక పాలిచ్చే హెచ్.ఎఫ్. ఆవు గుణాలు 62.5%, వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకునే సాహివాల్ ఆవు గుణాలు 37.5%గా ఉంటాయి. ఈనిన తర్వాత 300 రోజుల పాటు 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ICAR ప్రకటించింది.
News November 28, 2025
వైకుంఠద్వార దర్శనాలు.. తొలి రోజే 4.60L మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఆన్లైన్లో పేర్ల నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న దర్శనాల కోసం నిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రానికే 4.60L మంది నమోదుచేసుకున్నారు. DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్లు పంపుతారు.


