News June 3, 2024

పాక్ బ్రిగేడియర్‌గా తొలిసారి మహిళ నియామకం

image

పాకిస్థాన్ ఆర్మీలో బ్రిగేడియర్‌గా తొలిసారి ఓ మహిళ, క్రైస్తవ వర్గానికి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు. ఆర్మీ మెడికల్ కేర్‌లో సీనియర్ పాథాలజిస్ట్‌గా 26 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. దీంతో మేరీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. కాగా 2021 గణాంకాల ప్రకారం పాక్‌లో 96.47 శాతం ముస్లింలు, 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు ఉన్నారు.

Similar News

News April 8, 2026

4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశమంతటా ‘సర్’!

image

తుది దశ ఓటర్ల జాబితా సవరణ(సర్)ను 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. AP, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక సహా 17 రాష్ట్రాలు, 5 UTల్లో ఈ నెల 29 నుంచి చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 10 రాష్ట్రాలు, 3 UTల్లో ‘సర్’ పూర్తయింది. అస్సాంలో స్పెషల్ రివిజన్ నిర్వహించారు. మొత్తం 60 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. తుది దశలో 39 కోట్ల మంది వివరాలు రివ్యూ చేయనున్నారు.

News April 8, 2026

ముంబై అంటే పూనకాలే..

image

IPLలో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు మంచి రికార్డు ఉంది. మొత్తం 9 ఇన్నింగ్సుల్లో 53 సగటుతో 373 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 187గా ఉండటం విశేషం. 2023, 24 సీజన్లలో రెండు సెంచరీలు బాదారు. నిన్న 11 ఓవర్ల మ్యాచులో 32 బంతుల్లోనే 77* రన్స్ చేసి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

News April 8, 2026

ఒకప్పుడు 50 దాటాక.. ఇప్పుడు 30లోపే షుగర్

image

‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో 30 ఏళ్ల లోపున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. సగం కంటే ఎక్కువ మంది ఒబెసిటీ, కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే వీటిని గుర్తిస్తే 28% మంది మళ్లీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ 50 ఏళ్లు దాటాక ఆ అవకాశం కేవలం 7% మాత్రమే ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.