News February 8, 2025

తొలిసారి ‘ఆప్‌’కు 48 రోజులే అధికారం

image

మూడో సారి అధికారం చేజిక్కించుకోవడానికి CM పదవికి సైతం దూరంగా ఉంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహ‌ప్రతివ్యూహాలు రచించారు. BJPపై ఘాటు విమర్శలు చేస్తూనే హామీలు గుప్పించారు. కాగా, తొలిసారి 2013లో అధికారం చేపట్టిన ఆప్ కాంగ్రెస్ మద్దతుతో కేవలం 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆపై 2015 నుంచి రెండు సార్లు విజయం సాధించింది. నాలుగోసారి ఆప్ గెలుస్తుందని అనుకుంటున్నారా?

Similar News

News February 8, 2025

ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్

image

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్‌కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

News February 8, 2025

17 సీట్లలో BJP, AAP మధ్య తేడా 1000 ఓట్లే

image

ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.

News February 8, 2025

EC డేటా: BJP 40, AAP 30

image

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.

error: Content is protected !!