News May 4, 2024
ఢిల్లీలో తొలిసారి.. ఎన్నికల బరిలో థర్డ్ జెండర్
లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి రాజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో పోటీ చేస్తోన్న తొలి థర్డ్ జెండర్ ఇతనే కావడం విశేషం. తాము ఎదుర్కొంటోన్న సమస్యలను అధికారులు, ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమకు సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ప్రత్యేక వాష్‌రూమ్‌లు, క్యూలైన్లు, విద్య, ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజన్ కోరుతున్నారు.
Similar News
News December 31, 2024
ఇస్రోకి చంద్రబాబు అభినందనలు
PSLV-60 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు AP CM చంద్రబాబు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘మరో మైలురాయిని దాటిన ఇస్రోకు అభినందనలు. ఆర్బిటల్ డాకింగ్‌లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచేలా స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. మనుషుల రోదసి ప్రయాణానికి, ఉపగ్రహాలు మరమ్మతులకు ఇది చాలా కీలకం. ఈ విజయంతో చంద్రయాన్-4, స్పేస్ స్టేషన్ వంటి కీలక లక్ష్యాలకు భారత్ మరింత చేరువైంది’ అని పేర్కొన్నారు.
News December 31, 2024
అవును సల్మాన్‌తో నా పెళ్లి ఆగిపోయింది: హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు నటి సంగీత బిజిలానీకి పెళ్లంటూ ఒకప్పుడు బీ టౌన్‌లో బాగా ప్రచారం జరిగింది. అది నిజమేనని సంగీత ఓ ఇంటర్వ్యూలో తాజాగా అంగీకరించారు. తన పెళ్లి పత్రికల్ని పంచేవరకూ వచ్చి ఆగిపోయిందని సల్మాన్ కూడా గతంలో వెల్లడించారు. అయితే సంగీత పేరును ఆయన చెప్పలేదు. కాగా.. బాలీవుడ్‌లో సల్లూభాయ్ పలువురితో ప్రేమాయణం నడిపినా ఏదీ పెళ్లి పీటల వరకూ రాలేదని అక్కడి వారు అంటుంటారు.
News December 31, 2024
తెలంగాణ సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం
AP: తిరుమలకు తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖల్ని ఆమోదించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చంద్రబాబు నిర్ణయానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. MLA/MLC/MP నుంచి సోమవారం నుంచి గురువారం మధ్యలో ఏవైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2 లేఖలు స్వీకరిస్తామని లేఖలో చంద్రబాబు తెలిపారు.