News January 27, 2025
దేశంలోనే తొలిసారి.. బిచ్చం అడిగినందుకు అరెస్ట్
దేశంలో ఎన్నడూ లేని విధంగా.. భిక్షాటన చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. భోపాల్లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిచ్చమెత్తుకుంటున్న యాచకుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రం ఇటీవలే <<15081465>>భిక్షాటన నిరోధక చట్టాన్ని<<>> తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.
Similar News
News January 28, 2025
ఏపీ డీజీపీ నియామకంపై హైకోర్టులో పిల్
AP: DGP నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవడం లేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. UPSCకి పేర్లు పంపి షార్ట్ లిస్ట్ చేసిన వారిలో ఒకరిని డీజీపీగా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ నెల 31న DGP తిరుమలరావు పదవీకాలం ముగుస్తున్నందున అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రేపు విచారణ చేస్తామని సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ధర్మాసనం తెలిపింది.
News January 28, 2025
భారత్-చైనా కీలక నిర్ణయం
మానస సరోవర్ యాత్రను పున:ప్రారంభించాలని భారత్, చైనా కలిసి నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ ఉప మంత్రి సన్ వెయ్డాంగ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నదులు, జల వనరులకు సంబంధించి డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. కాగా కొవిడ్-19 కారణంగా మానస సరోవర్ యాత్రను 2020లో నిలిపివేశారు.
News January 28, 2025
ఫోన్ ఆపరేటింగ్ నేర్చుకున్న కేసీఆర్
TG: మాజీ సీఎం కేసీఆర్ సొంతంగా ఫోన్ వాడుతున్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఫోన్ ఉపయోగించలేదు. కుటుంబసభ్యులు, నేతలు, సిబ్బంది ఫోన్లతోనే ఆయన ఇతరులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ తనయుడు, తన మనవడు హిమాన్ష్ ఫోన్ ఆపరేట్ చేయడం నేర్పించారు. కేటీఆర్, హరీశ్, కవితతోపాటు పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.