News September 20, 2024

147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి..

image

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన అశ్విన్ ఓ ప్రపంచ రికార్డును సృష్టించారు. 20 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్, 30+ సందర్భాల్లో 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ సాధించింది ఈయనే కావడం విశేషం. అశ్విన్ 101 మ్యాచ్‌లలో 14 హాఫ్ సెంచరీలు, 6 శతకాలు, 36 సార్లు 5W, 8 సార్లు 10W తీశారు.

Similar News

News November 22, 2025

Photo: మెరిసిపోతున్న ఢిల్లీని చూశారా?

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత ఫొటోలను నాసా SMలో షేర్ చేసింది. ఢిల్లీ, టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు రాత్రి పూట వెలిగిపోతున్నాయి. ఇవి స్పేస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన అర్బన్ సెంటర్లు అని నాసా క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో ఢిల్లీ వ్యూ మాత్రం కళ్లుచెదిరేలా ఉంది. సిటీని విభజిస్తున్న యమునా నది, విద్యుత్ దీపాల వెలుగుల్లో సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తోంది.

News November 22, 2025

రెండో టెస్ట్: సమర్పిస్తారా? సమం చేస్తారా?

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు గిల్ దూరం కాగా, రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తొలి టెస్టు మాదిరే ఇందులోనూ గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ప్రొటీస్ సొంతం కానుంది. మరోవైపు ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఉ.9.00 మ్యాచ్ ప్రారంభం కానుంది.

News November 22, 2025

అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారొచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడనం నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.