News October 28, 2024

భారత్ చరిత్రలో తొలిసారి!

image

ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని భారత్ గెలుచుకుంది. పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా పోటీలో విజయం సాధించి మన దేశానికి తొలి కిరీటాన్ని తెచ్చిపెట్టారు. దీంతోపాటు గ్రాండ్ పేజెంట్స్ ఛాయిస్ అవార్డునూ ఆమె గెలుచుకున్నారు. ఇందులో 70 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. ‘మనం సాధించాం. భారత చరిత్రలో మొదటి గోల్డెన్ క్రౌన్‌ను గెలిచాం’ అని రాచెల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

Similar News

News October 28, 2024

హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ‌కి సంబంధించిన కేసులో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి పోలీసులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

News October 28, 2024

నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు: నయన్

image

తాను ఫేస్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నేను ఎక్కువగా ఐబ్రోస్ చేయించుకోవడాన్ని ఇష్టపడతా. కొన్నేళ్లుగా నా ఐబ్రోస్‌లో మార్పులు వస్తుండటంతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానని కొందరు భావించి ఉండొచ్చు’ అని ఆమె అన్నారు.

News October 28, 2024

అసెంబ్లీలో పీఏసీ సమావేశం.. బహిష్కరించిన BRS

image

TG: అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష BRS పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపింది. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. BRS నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన BRS నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో కారు పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.