News May 19, 2024

IPL చరిత్రలో తొలిసారి

image

ఇవాళ పంజాబ్, సన్‌రైజర్స్ మ్యాచులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ జట్టు కేవలం ఒకే విదేశీ ప్లేయర్‌తోనే బరిలోకి దిగింది. ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టు ఒకే విదేశీ ప్లేయర్‌తో ఆడటం ఇదే తొలిసారి. కాగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఓ జట్టు గరిష్ఠంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించేందుకు వీలుంది. పంజాబ్ జట్టులోని కీలక ప్లేయర్లు సొంత దేశాలకు వెళ్లగా.. కేవలం రోసో ఒక్కరే ఆడారు. ఈ మ్యాచ్‌లో SRH గెలిచింది.

Similar News

News December 3, 2025

ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

image

క్రికెట్‌ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్‌లో ధోనీ రూమ్‌ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్‌ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.

News December 3, 2025

సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

image

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.