News September 26, 2025

ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారి

image

ఆసియా కప్ 2025లో ఫైనలిస్టులు ఖరారయ్యాయి. ఈ నెల 28న జరిగే ఫైనల్లో టీమ్‌ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఎడిషన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 2 మ్యాచుల్లోనూ పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా మట్టికరిపించింది. మరోవైపు ఓవరాల్‌గా భారత్, పాక్ రెండు సార్లు(T20I WC-2007, CT 2017) ఫైనల్లో తలపడగా చెరో విజయం సాధించాయి.

Similar News

News February 7, 2026

NPCILలో 114 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL)లో 114 పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును FEB 9వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, టెన్త్+ITI, ఇంటర్(MPC), ఇంటర్+మెడికల్ రేడియోగ్రఫీ/X-Ray టెక్నిక్ ట్రేడ్ సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://www.npcilcareers.co.in

News February 7, 2026

పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లారు: CM

image

TG: ఫోన్ ట్యాపింగ్ చేస్తే నోటీసు ఇవ్వకపోతే ఏం చేస్తారని సీఎం రేవంత్ అన్నారు. ‘తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చామని కొందరు అంటున్నారు. తప్పు చేస్తే బేడీలు వేసి లాక్కొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ పోలీసులు మంచివాళ్లు కాబట్టి పద్ధతిగా కేసీఆర్ ఇంటికే వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు’ అని పరిగి బహిరంగ సభలో తెలిపారు.

News February 7, 2026

రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR

image

TG: రేవంత్ ఎప్పటికైనా BJP మనిషేనని KTR ఎద్దేవా చేశారు. కామారెడ్డి(D) బాన్సువాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ కాంగ్రెస్ నేత కాదు బడే భాయ్ తమ్ముడు. కాంగ్రెస్ నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్లే వారికి ఓటేయాలి. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఆయన విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో దూరారు’ అని విమర్శించారు.