News April 10, 2025
ప్రపంచంలో తొలిసారి.. AI సాయంతో శిశువు జననం

ఏఐ అసిస్టెడ్ IVF విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్లో నిపుణుల సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చారు. అండంలోకి స్పెర్మ్‌ను నేరుగా ఇంజెక్ట్ చేసే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI)కు బదులు ఆటోమేటెడ్ IVF సిస్టమ్‌ను ఉపయోగించారు. దీని ద్వారా ICSI ప్రక్రియలోని 23 దశలు మనిషి సాయం లేకుండానే పూర్తయ్యాయి. ఈ ప్రక్రియకు 9min 56sec సమయం పట్టింది.
Similar News
News November 15, 2025
గిల్ రిటైర్డ్ హర్ట్.. IND 3 వికెట్లు డౌన్

SAతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. సుందర్(29) అవుటవ్వగానే బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ తాను ఆడిన మూడో బంతికే ఫోర్ బాదారు. అయితే ఆ షాట్ కొట్టగానే ఆయన మెడ పట్టేసింది. కాసేపు నొప్పితో బాధపడ్డ గిల్ బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడారు. అతని స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చారు. మరోవైపు భారత్ 109 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్(39) కూడా ఔట్ అయ్యారు.
News November 15, 2025
PGIMERలో 151 పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<
News November 15, 2025
హనుమాన్ చాలీసా భావం – 10

భీమరూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ||
ఆంజనేయుడు భయంకరమైన, భీకరమైన రూపాన్ని ధరించి, శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా, శ్రీ రామచంద్రుడను నమ్మి ఆయన ముఖ్య కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎంతటి శక్తి ఉన్నా.. ఆ బలాన్ని ఉత్తమ ధర్మాన్ని నిలబెట్టడానికి, దైవ కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


