News July 25, 2024

‘సియాచిన్ గ్లేసియర్’ వద్ద తొలిసారి మహిళా ఆఫీసర్‌కు విధులు!

image

‘సియాచిన్ గ్లేసియర్’ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ తొలి మహిళా ఆఫీసర్‌గా CT సుప్రిత నిలిచారు. హిమాలయాల్లోని తూర్పు కారాకోరం శ్రేణిలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ఇది. నెల రోజుల కఠినమైన శిక్షణ అనంతరం ఆమెను ఇక్కడ నియమించినట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. 2021లో లెఫ్టినెంట్‌గా చేరిన ఆమె ఇండియన్ ఆర్మీలో రెండో మహిళా అధికారిణిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Similar News

News February 23, 2026

పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్: CBN

image

AP: పనితీరు సరిగా లేని ఉద్యోగులను మోటివేట్ చేయడంతోపాటు పని చేస్తున్న వారిని ప్రోత్సహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ప్రతినెల ఉద్యోగుల పనితీరును మదింపు చేయాలి. బాగా పనిచేస్తున్న వారికి అభినందన లేఖ పంపాలి. ఇకపై పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలి. వ్యక్తిగత రికార్డుల్లో ఆ పాయింట్లు నమోదు చేయాలి’ అని వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో CM సూచించారు. రెవెన్యూ శాఖపై ఉన్న చెడ్డపేరు పోవాలన్నారు.

News February 23, 2026

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP) పేరును మార్చారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా ఛేంజ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇక నుంచి TVVP ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. అలాగే హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News February 23, 2026

ఎన్నికలకు ముందే BCలకు 34% రిజర్వేషన్లు: CBN

image

AP: గత GOVT స్థానిక ఎన్నికల్లో BCల రిజర్వేషన్లను 24%కి తగ్గించిందని CM CBN అసెంబ్లీలో విమర్శించారు. ‘వారికి 34% రిజర్వేషన్ కోసం కమిటీ వేశాం. ఎలక్షన్స్‌కు ముందే రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ST వర్గీకరణ కోసం జీఓ3 తెస్తే కాపాడలేకపోయారు. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాం. పేదలందర్నీ ఆదుకొనేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులిస్తాం’ అని తెలిపారు.