News September 3, 2025

గర్భాశయ ఆరోగ్యం కోసం..

image

మహిళల పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయ ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనికోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది వ్యర్థాలని బయటకు నెట్టి ఇన్‌ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉండే ఆహారాలు తీసుకుంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడకుండా చూస్తాయి. కణితులు ఏర్పడకుండా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే గుమ్మడి, అవిసె గింజలు, నువ్వులు తీసుకోవాలి.

Similar News

News September 3, 2025

మహిళల ఆరోగ్యం కోసం ఇలా చేయండి!

image

ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కళకళలాడుతుంది. అందుకే ప్రతి మహిళ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. *వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల్లో కండరాలు బలహీనంగా మారతాయి. కాబట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామం చేయాలి. *వెజ్, నాన్ వెజ్ రూపంలో ప్రోటీన్ తీసుకోవాలి. *కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. *బోన్ హెల్త్ కోసం 35+ వయసున్నవారు వారానికి 2సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి.

News September 3, 2025

గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి

image

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో 5 నెలల్లోనే 28 మంది మరణించారు. ఇద్దరికి బ్లడ్ టెస్ట్ చేయగా వారికి ‘ఇన్‌ఫెక్షన్ మెలియాయిడోసిస్’ అనే డేంజర్ వ్యాధి సోకినట్లు గుర్తించారు.. బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు త్వరగా సోకుతుంది. దీని వల్ల జ్వరం వచ్చి ప్రాణాలు పోవచ్చు. అక్కడ టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

News September 3, 2025

హరీశ్ వల్లే వారంతా పార్టీని వీడారు: కవిత

image

TG: గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు పార్టీని వీడారని మండిపడ్డారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీశే కారణం. హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు. నాన్నకు నన్ను దూరం చేసేందుకు కుట్ర చేశారు’ అని ఆమె విరుచుకుపడ్డారు.