News October 7, 2024
డబ్బులు లేవంటూ ఈ సోకులు ఎవరికోసం?: KTR

TG: ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టు రేవంత్ వైఖరి ఉందని మండిపడ్డారు. పొద్దున లేస్తే రాష్ట్రం అప్పులపాలైందని, డబ్బులు లేవని అరిచిన రేవంత్.. మూసీ పేరిట రూ.లక్షా యాభైవేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News October 23, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్!

* రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
* ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డూడ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. ఈనెల 17న ఈ చిత్రం రిలీజవగా వారం రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.
News October 23, 2025
కరప్షన్, క్రైమ్.. ఇవే NDA డబుల్ ఇంజిన్లు: తేజస్వీ

ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పని చేస్తామని ఆర్జేడీ నేత, మహాఘట్బంధన్ <<18080695>>సీఎం అభ్యర్థి<<>> తేజస్వీ యాదవ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఒక ఇంజిన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బిహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదని అన్నారు. కొత్త బిహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. NDA సీఎం అభ్యర్థి ఎవరో BJP, అమిత్ షా క్లారిటీ ఇవ్వాలన్నారు.
News October 23, 2025
టాస్ గెలిచిన న్యూజిలాండ్

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్లు నవీ ముంబై వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన NZW జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
INDW ప్లేయింగ్ Xl: ప్రతీకా, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్(C), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి, రిచా, స్నేహ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
NZW: సుజీ బేట్స్, జార్జియా, అమేలియా, సోఫీ(C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, రోజ్మేరీ, లియా, ఈడెన్ కార్సన్