News June 5, 2024
ఆస్పత్రిలో ‘బలగం’ మొగిలయ్య!
బలగం సినిమా ఫేమ్ మొగిలయ్య తీవ్ర అస్వస్థతతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్సకు అవసరమైన డబ్బులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కొమురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడిన ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బలగం క్లైమాక్స్‌లో ఈ దంపతులు పాడిన పాట అందరి గుండెలను పిండేసింది.
Similar News
News November 28, 2024
నేటి నుంచి ‘రైతు పండుగ’
TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్‌నగర్‌లో ‘రైతు పండుగ’ నిర్వహించనుంది. దీనిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు 150 స్టాళ్లను ఏర్పాటు చేయనుండగా వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
News November 28, 2024
మధ్యాహ్నం భోజనం ధరల పెంపు
మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.
News November 28, 2024
నేడు వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి ఇవాళ రెండో దశ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు TGPSC ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఇంజినీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్‌కు సంబంధించి వెరిఫికేషన్ నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఒకవేళ ఇవాళ వెరిఫికేషన్‌కు గైర్హాజరైనా, సర్టిఫికెట్లు పెండింగ్ ఉన్నా ఈ నెల 29న రీ-వెరిఫై చేస్తారు.