News February 12, 2025
భార్యతో బలవంతపు అసహజ శృంగారం నేరం కాదు: హైకోర్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294015974_1045-normal-WIFI.webp)
భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. ‘15 ఏళ్లు దాటిన భార్యతో భర్త చేసే ఏ శృంగారాన్నీ అత్యాచారంగా పరిగణించలేం. ఆమె ఒప్పుకోనప్పటికీ అసహజ శృంగారానికీ ఇది వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. అసహజ శృంగారం కారణంగా ఓ వ్యక్తి భార్య చనిపోయింది. అతడికి కింది కోర్టులో శిక్ష పడగా హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News February 12, 2025
ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738600740850_367-normal-WIFI.webp)
TG: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
News February 12, 2025
సినీ పరిశ్రమకు మేం వ్యతిరేకం కాదు: పుష్ప శ్రీవాణి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739307629195_893-normal-WIFI.webp)
AP: విశ్వక్‌సేన్ ‘లైలా’ సినిమాకి తాము వ్యతిరేకం కాదని YCP నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తమపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే తాము వ్యతిరేకం అని, సినీ పరిశ్రమకు కాదని పేర్కొన్నారు. YCPపై జోకులు వేసే ఆర్టిస్ట్ నటించే ప్రతి సినిమాని బాయ్‌కాట్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘టికెట్ కొనుక్కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకొనేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదు’ అని ట్వీట్ చేశారు.
News February 12, 2025
త్వరలో గూగుల్ మెసేజెస్ యాప్ నుంచే వాట్సాప్ కాల్స్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739315068450_893-normal-WIFI.webp)
గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా WhatsApp వీడియో కాల్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా Google meet వీడియో కాల్స్ మాత్రమే చేసుకునేందుకు వీలుంది. అయితే యాప్స్‌ను స్విచ్ చేసుకునే బదులు, యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ తీసుకొస్తోంది. తొలుత వన్ ఆన్ వన్ కాల్స్‌కు మాత్రమే ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్‌లో వాట్సాప్ ఇన్‌స్టాల్ అయి ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.