News October 9, 2024

విదేశీ విద్య: ఏ ఇన్‌టేక్ మంచిది..?

image

విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్‌ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్‌టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్‌ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్‌టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్‌టేక్‌ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News October 15, 2025

ఈ అష్టకం చదివితే కష్టాలు దూరం

image

నమామీశ్వరం సచ్చితానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానం|
యశోభియోలూఖలాద్దావమానం
పరామృష్ఠమత్యంతతో ధృత్యగోప్యా ||”
​ఈ దామోదరాష్టకాన్ని రోజూ పఠిస్తే కృష్ణుడి కృప లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తుల బాధలు, పాపాలు తొలగి, స్వామివారి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. మోక్షానికి మార్గమైన ఈ స్తోత్ర పారాయణ కష్టాలను తొలగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#SHLOKA<<>>

News October 15, 2025

AVNLలో 98 పోస్టులు

image

చెన్నైలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్(AVNL) హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో 98 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, NAC/NTC/STC ట్రేడ్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు ఈనెల 31లోగా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News October 15, 2025

నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: ప్రశాంత్ కిశోర్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టానని, తన పోటీ ముఖ్యం కాదన్నారు. 150కి ఒక్క సీటు తగ్గినా ఓటమిగానే భావిస్తామని స్పష్టం చేశారు. బిహార్‌లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కొద్ది నెలల క్రితమే పీకే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాలకు గాను ఇప్పటికే 116 మంది అభ్యర్థులను ప్రకటించారు.