News September 11, 2025

భారత విపక్షం వెనుక విదేశీ హస్తం: భండారీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ‘ఓట్ చోరీ’ ప్రజెంటేషన్‌పై BJP అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘రాహుల్‌ను ఏ ఫారిన్ బాస్ నడిపిస్తున్నారు? AUG 7న ఓట్ చోరీపై వెబ్‌సైట్లో 3PDFs అప్‌లోడ్ చేశారు. అవి మయన్మార్ నుంచి అప్‌లోడ్ అయ్యాయి. ఆధారాలంటూ ఆయన చూపినవి ఇండియాలో తయారవ్వలేదు. భారత విపక్షం వెనుక విదేశీ హస్తముందని బయటపడింది. రాహుల్, కాంగ్రెస్ డెమోక్రసీకి అత్యంత ప్రమాదకరం’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 11, 2025

నా అంచనాలను అందుకొని బెస్ట్ ఇవ్వాలి: CBN

image

AP: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచనలు, అంచనాలను అందుకొని, ఉత్తమ ప్రదర్శన చేయాలి. CM అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నా. మీరూ అదే పాటించాలి. అన్నింటికి రూల్స్‌తోనే కాకుండా మానవీయ కోణంలోనూ పనిచేయాలి. ఫేక్ ప్రచారాల పెను సవాళ్లను ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ నిర్ణయాలు ఉండాలి’ అని తెలిపారు.

News September 11, 2025

ఈనెల 15 నుంచి చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డులు: మంత్రి

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 శాతం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘చివరి దశలో భాగంగా 9 జిల్లాల్లో ఈనెల 15 నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. అక్టోబర్ 31 వరకు కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉచితంగా చేసుకోవచ్చు. పొరపాట్లు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వాటిని సరిచేసిన తర్వాత ఉచితంగా కార్డులు అందిస్తాం’ అని ట్వీట్ చేశారు.

News September 11, 2025

తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎందరంటే?

image

గతేడాది ట్యాక్స్ రిటర్న్స్ డేటా ప్రకారం రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలో అధికంగా మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులున్నారు. ఆ తర్వాత యూపీలో 24,050, మధ్యప్రదేశ్‌లో 8,666, తమిళనాడులో 6,288 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 5,340, తెలంగాణలో 1,260 మంది ఉండటం గమనార్హం. ఇక లద్దాక్‌లో ముగ్గురు, లక్షద్వీప్‌లో ఒకరు మాత్రమే ఉన్నారు.