News February 22, 2025
విదేశీ జోక్యం: కాంగ్రెస్‌పై దాడి పెంచిన BJP

USAID నిధులపై <<15542230>>ట్రంప్<<>> వివరాలు చెప్పే కొద్దీ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై BJP విమర్శల తీవ్రతను పెంచుతోంది. వాటిని ప్రతిపక్షాల గెలుపు కోసమే బైడెన్ కేటాయించినట్టు ఆరోపిస్తోంది. ED, CBI, ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేపట్టాలని కోరుతోంది. గతంలో పదేపదే USకు వెళ్లే RG ఇప్పుడెందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తోంది. ప్రజాస్వామ్యం నాశనమవుతోందంటూ అక్కడ ఆయన అంతర్జాతీయ సమాజ జోక్యం కోరడాన్ని గుర్తుచేస్తోంది.
Similar News
News February 22, 2025
IML T20: నిరాశపర్చిన సచిన్.. స్కోర్ ఎంతంటే?

ముంబైలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. శ్రీలంక మాస్టర్స్ జట్టుపై 8 బంతుల్లో 10 రన్స్ చేసి ఔటయ్యారు. అంబటి రాయుడు 5, గుర్‌కీరత్ సింగ్ మాన్ 44, స్టువర్ట్ బిన్నీ 68, యువరాజ్ 31*, యూసఫ్ పఠాన్ 56* రన్స్ చేశారు. ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 222/4 రన్స్ చేసింది.
News February 22, 2025
బంతులా?.. బుల్లెట్లా?

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.
News February 22, 2025
15 ని. ముందే సెంటర్లకు చేరుకోవాలి: APPSC

AP: రేపు గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ప్రకటించిన APPSC.. అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం ఉ.10 గం. నుంచి మ.12.30 గం. వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది.