News April 1, 2024
‘ఎంపీగా గెలిపిస్తే పేదలకు విదేశీ మద్యం’

తనను ఎంపీగా గెలిపిస్తే పేదలకు విదేశీ మద్యం ఇస్తానని ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో వనితా రౌత్ అనే ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి ఈ వినూత్న ప్రచారం చేస్తున్నారు. సబ్సిడీ ధరలకు బీరు, విస్కీ ఇస్తానని చెప్పారు. ప్రతీ గ్రామంలో ఎంపీ నిధులతో విదేశీ మద్యం, బీర్లతో బార్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. పేదలకు ఒకే ఒక విలాసం మద్యం తాగడమని.. అందుకే వారికి ఈ పథకం అవసరమన్నారు.
Similar News
News February 16, 2026
UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.
News February 16, 2026
పాకిస్థాన్‌పై గెలుపు.. ఇండియా సరికొత్త రికార్డు!

T20 WCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా <<19153355>>అద్భుత విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. పాక్‌తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్‌పై శ్రీలంక, ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
News February 16, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


