News January 5, 2025

మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే: వెంకయ్యనాయుడు

image

TG: ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. HICCలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వేష, భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కోపంలోనూ ఎదుటివారి మంచిని కోరుకోవడం మన సంప్రదాయం. మీ పిల్లలు చల్లగుండ.. మీ ఇల్లు బంగారంగాను అని తిట్టుకునేవారు. మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే’ అని పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

వరంగల్: అక్ర‘మార్కులు’ కలిపిన ఆ పెద్దాయన ఎవరు..?

image

డబ్బులిస్తే ఫెయిల్ ఐనవారిని పాస్ చేయడం కొన్ని విద్యా సంస్థల్లో నిత్యంజరిగే వ్యవహారం. మనుషుల ప్రాణాలను కాపాడే ప్రాణదాతల విషయంలో సబ్జెక్టు లేకపోతే శంకర్ దాదా లాంటి డాక్టర్లు అవుతారు. ఈ లాజిక్‌ను మరిచిన ఓ పెద్దాయన లాగిన్‌లోనే ఈ అక్ర‘మార్కుల’ తంతు జరగడం కలకలం రేపుతోంది. అక్రమార్కులకు కేంద్రంగా మారిన కాళోజీ హెల్త్ యూనివర్శిటీని ప్రక్షాళన చేయాలి. ఇంటిదొంగను కాపాడేందుకు ఓ నేత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

News November 27, 2025

రాజ్యాంగంలోని ప్రాథమిక విధులివే..

image

ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్న పౌరులు విధులనూ నిర్వర్తించాలని రాజ్యాంగదినోత్సవంలో నాయకులంతా పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని IV-A భాగంలో 51-Aలో ఉన్న 11 ప్రాథమిక విధులు క్లుప్తంగా.. రాజ్యాంగ సంస్థలు, పతాకం, గీతం, సమరయోధులు, దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. దేశ రక్షణకు సిద్ధంగా ఉండాలి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలకు అతీతంగా ఉండాలి. పర్యావరణం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. పిల్లలకు విద్యను అందించాలి.

News November 27, 2025

రిజర్వేషన్లపై హైకోర్టులో నేడే విచారణ

image

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలంటూ <<18397909>>దాఖలైన<<>> పిటిషన్‌పై ఇవాళ HCలో విచారణ జరగనుంది. జనాభా గణాంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ వేశారు. దీని వల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలును నిలిపివేయాలని కోరారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ వేళ దీనిపై HC ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.