News November 14, 2024

జగనన్నా క్షమించు.. లోకేశన్నా కాపాడు: శ్రీరెడ్డి

image

AP: తన వల్ల YCPకి చెడ్డపేరు వచ్చిందని, మాజీ CM జగన్ క్షమించాలని నటి శ్రీరెడ్డి కోరారు. ప్రత్యర్థులపై తాను వాడిన భాషతో పార్టీకి నష్టం జరిగిందని, ఇకపై YCPకి దూరంగా ఉంటానని లేఖ రాశారు. మరోవైపు, తన కుటుంబాన్ని కాపాడాలని మంత్రి లోకేశ్‌ను కోరారు. కూటమి పార్టీలు, నేతలపై జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశానని, సారీ చెబుతున్నట్లు రాసుకొచ్చారు. శ్రీరెడ్డిపై రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో కేసులు నమోదయ్యాయి.

Similar News

News December 27, 2024

ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి

image

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (97) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. కాగా కొద్ది రోజులుగా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న ఆయన ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డా.వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందించగా పూర్తిగా కోలుకున్నారు.

News December 27, 2024

ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తలపాగా, గడ్డం లేకుండా ఆయన కనిపించారు. కాగా మన్మోహన్ కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.

News December 27, 2024

మ‌న్మోహ‌న్‌ను రాజ‌కీయాల్లోకి తెచ్చింది పీవీనే

image

RBI గవర్నర్‌గా ఉన్న మ‌న్మోహ‌న్‌కు రాజ‌కీయాలు ప‌రిచ‌యం చేసింది PV న‌ర‌సింహారావు అనే చెప్పాలి. 1991లో దుర్భ‌ర ఆర్థిక ప‌రిస్థితుల నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించ‌డానికి సింగ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపి ఆర్థిక మంత్రిని చేశారు. Liberalisation, Privatisation, Globalisation పాలసీతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా నాటి సంస్కరణలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయి.