News January 23, 2025
మెట్రోలో ఇన్ని వస్తువులు మర్చిపోయారా?

అసాంఘిక కార్యకలాపాలతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రో రైలులో గతేడాది కోట్ల రూపాయల వస్తువులను విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. రైలులో & స్టేషన్ ఏరియాలోని ఎక్స్ రే లగేజీ స్కానర్ వద్ద మర్చిపోయిన వాటిల్లో రూ.40 లక్షలకు పైగా నగదు, 89 ల్యాప్టాప్స్, 193 మొబైల్స్‌తో పాటు 9 మంగళసూత్రాలు, వెండి ఆభరణాలు, ఉంగరాలున్నాయి. అయితే, CISF సిబ్బంది ద్వారా వీటి యజమానులను గుర్తించినట్లు వెల్లడించారు.
Similar News
News November 9, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ(<
News November 9, 2025
లైట్‌హౌస్ పేరెంటింగ్ గురించి తెలుసా?

పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు రకరకాల పద్దతుల ఉపయోగిస్తారు. వాటిలో ఒకటే లైట్‌హౌస్ పేరెంటింగ్. ఈ పద్ధతిలో పిల్లలు జీవితంలో అన్నిట్లో రాణించాలని పేరెంట్స్ అనుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, విజయం వైపు వెళ్లడానికి వారికి మద్దతుగా నిలుస్తారు. ఇది పిల్లలు నేర్చుకోవడానికి, సానుకూలంగా ఎదగడానికి సాయపడుతుంది. పిల్లలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ వారికి తోడుగా ఉంటారు. దీన్నే డాల్ఫిన్ పేరెంటింగ్ అని కూడా అంటారు.
News November 9, 2025
హిందువులు మీతో లేరని ఒప్పుకుంటారా?: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ప్రజల్లో 80% హిందువులు BJP వైపు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘ఈ ఎన్నికల్లో BJP డిపాజిట్ పోతుంది. రాసిపెట్టుకోండి. మీరు ఓడిపోతే హిందువులు మీతో లేరు అని భావించాలి’ అని ఛాలెంజ్ విసిరారు. BRS గెలుపు కోసం జూబ్లీహిల్స్‌లో BJP పనిచేస్తోందన్నారు. BRS విలీనమైతే వచ్చే లాభంపై ఇక్కడ రెండు పార్టీలు లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


