News October 6, 2025

UPI పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి 2/2

image

చాలా మంది UPI పిన్‌ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్‌లో “Forgot UPI PIN” అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్‌ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.

Similar News

News October 6, 2025

సత్తా చాటిన శ్రియాన్షి

image

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ తస్నిమ్‌ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

News October 6, 2025

BREAKING: రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

image

TG: బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని పిటిషనర్‌ గోపాల్‌రెడ్డిని ప్రశ్నించింది. అయితే HCలో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. దీంతో HCలో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని SC స్పష్టం చేసింది. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది.

News October 6, 2025

బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీంలో విచారణ ప్రారంభం

image

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.