News December 19, 2024

తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఇది మీకోసమే!

image

ఇంట్లో బైక్ కీ, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఎక్కడో పెట్టి మర్చిపోతున్న వారికి గుడ్ న్యూస్. అలాంటి వారికోసం జియో వినూత్న పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. JioTag Go పరికరం Find My Device ద్వారా వస్తువులను ట్రాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు వారి స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా గ్యాడ్జెట్లు, కీలు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. కీచైన్ మాదిరిగా దీనిని వాడుకోవచ్చు.

Similar News

News November 19, 2025

HYD: కేంద్రమంత్రికి చనగాని దయాకర్ బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో ఐఐఎంలు, ఐఐటీలు, పెట్రోలియం సంస్థలతోపాటు ఇతర కేంద్రీయ విద్యా సంస్థలను తక్షణమే మంజూరు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కేంద్ర అనుమతిని మంజూరు చేయించాలని అభ్యర్థించారు.

News November 19, 2025

అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

image

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 19, 2025

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

image

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్‌ ఇష్యూస్‌ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్‌&డైలాగ్‌ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.