News May 25, 2024
కౌంటింగ్ రోజున ఫామ్-17C కీలకం.. ఏంటిది?

ప్రతి బూత్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో పీవో సంతకంతో పార్టీల ఏజెంట్లు ఫామ్-17C తీసుకుంటారు. వీటిని నియోజకవర్గ పార్టీ ఆఫీసులకు పంపుతారు. కౌంటింగ్ రోజున ప్రతి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లకూ, ఫామ్-17Cలో నమోదు చేసిన లెక్కకు సరిపోలాలి. లేదంటే ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. కౌంటింగ్ రోజు ఏజెంట్లు ఏం చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ <<13307957>>క్లిక్<<>> చేయండి.
Similar News
News November 27, 2025
పన్ను ఊడిపోయిందా? డెంటల్ ఇంప్లాంట్ అవసరం లేదు!

ఊడిపోయిన దంతాల ప్లేస్‌లో కొత్తవి వచ్చే విధంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బయోయాక్టివ్ ప్యాచ్‌ను ఆవిష్కరించారు. ఇది కృత్రిమ దంతాలకు ప్రత్యామ్నాయంగా దవడలోని స్టెమ్ సెల్‌లను చురుకుగా మారుస్తుంది. ఇది పూర్తి దంత నిర్మాణాన్ని సహజంగా పెంచుతుంది. పన్ను పోయిన చోట ఈ ప్యాచ్‌ను అమర్చితే చిగుళ్లలోపలి నుంచి కొత్త పన్ను వస్తుంది. మానవులపై జరిపే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఎంతో మందికి ఇది ఉపయోగపడనుంది.
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్‌గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.


