News September 28, 2024

సీఎం పర్యటనల కోసం అడ్వాన్స్ టీమ్స్ ఏర్పాటు

image

ఏపీ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటనల ముందస్తు ఏర్పాట్ల కోసం రెండు అడ్వాన్స్ టీమ్స్‌ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు చేయాల్సిన పనులపై ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. సీఎం పర్యటనలకు 24 గంటల ముందు ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తాయి.

Similar News

News November 23, 2025

మొక్కజొన్న, వేరుశనగలో బోరాన్ లోప లక్షణాలు

image

☛ మొక్కజొన్న: లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుంచి బయటికి రావు. బోరాన్ లోప తీవ్రత అధికంగా ఉంటే కండెలపై గింజలు వంకర్లు తిరిగి చివరి వరకు విస్తరించవు. దీని వల్ల దిగుబడి, సరైన ధర తగ్గదు. ☛ వేరుశనగ: లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసరిగా కనిపిస్తాయి. బీజం నుంచి మొలకెత్తే లేత ఆకు కుచించుకొని రంగు మారుతుంది.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.