News March 30, 2024
బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

ఎన్నికల్లో 400 సీట్ల బంపర్ మెజార్టీనే లక్ష్యంగా పెట్టుకున్న BJP తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఉన్నారు. ఈ 27 మంది సభ్యుల కమిటీలో అశ్వినీ వైష్ణవ్, స్మృతీ ఇరానీ మొదలైన కేంద్ర మంత్రులూ ఉన్నారు.
Similar News
News January 27, 2026
నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన కేంద్ర బృందం

TG: సింగరేణి కంపెనీలో CSR నిధులు దుర్వినియోగం అయినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల బృందం గుర్తించింది. మెస్సీ ఫుట్‌బాల్ ఈవెంట్, రాజీవ్ అభయ హస్తం పథకం సహా కొన్ని ఇతర అంశాలకూ ఈ నిధులు వినియోగించినట్లు కనుగొంది. అలాగే నైనీ బొగ్గు టెండర్ల డాక్యుమెంట్లను లోతుగా విశ్లేషణ చేసింది. వీటిపై తన పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. గత వారం బృందం HYD వచ్చి విచారించడం తెలిసిందే.
News January 27, 2026
ఇంటర్వ్యూతో ESIC ఫరీదాబాద్‌లో 50 పోస్టులు

<
News January 27, 2026
ఒకే రోజు రూ.63 కోట్ల కలెక్షన్లు

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బార్డర్-2’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. నిన్న ఒక్క రోజే ఈ మూవీకి రూ.63 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ తెలిపారు. మొత్తంగా నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.193.48 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిందని పేర్కొన్నారు. అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీలో వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రలు పోషించారు.


