News July 3, 2024
రైతు భరోసాపై మంత్రులతో సబ్‌కమిటీ ఏర్పాటు

AP: రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సబ్‌కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది.
Similar News
News February 7, 2026
సింగరాయకొండలో ఈ నెల 8న తిరుప్పావడ సేవ

సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 8న ఆదివారం ఉదయం 6:30 గంటలకు తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఈ సేవ నిర్వహిస్తామని EO కృష్ణవేణి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె అన్నారు.
News February 7, 2026
కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: జేడీ

జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ సీజన్‌కు 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించగా, ఇప్పటికే 25,404 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం మరో 4,603 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.
News February 7, 2026
NTR: రోడ్లపై చెత్తవేసే వారికి షాకింగ్ న్యూస్..!

రోడ్లపై చెత్త వేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారికి కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడ కార్పొరేషన్ సర్కిల్-1 పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నమోదు చేసిన 17 కేసులపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. నిబంధనలు పాటించని వారికి రూ.4,140లు జరిమానా విధించారు. నగరాన్ని అపరిశుభ్రం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతకు అందరూ కృషి చేయాలన్నారు.


