News June 2, 2024

ఆకాంక్షలు నెరవేర్చేందుకే తెలంగాణ ఏర్పాటు: రాహుల్

image

TG: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి నా నివాళులు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారతను చేకూర్చాలనే ‘ప్రజా తెలంగాణ’ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News December 28, 2025

సొంత పార్టీలో ‘దిగ్విజయ్’ చిచ్చు!

image

దిగ్విజయ్ సింగ్ చేసిన RSS అనుకూల <<18686086>>వ్యాఖ్యలపై<<>> సొంత పార్టీ కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థుల బలాన్ని విశ్లేషించడం తప్పు కాదంటూ కొందరు ఆయనకు మద్దతుగా నిలిస్తే.. ‘గాడ్సే’ని నమ్మేవాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. కార్యకర్త PM అవ్వడం BJPలోనే సాధ్యమని దిగ్విజయ్ నిన్న పోస్ట్ చేశారు.

News December 28, 2025

UGC-NET అడ్మిట్ కార్డులు విడుదల

image

డిసెంబర్ సెషన్‌కు సంబంధించి UGC-NET అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. NETకు అప్లై చేసుకున్న వారు https://ugcnet.nta.nic.in/లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టులకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 31, జనవరి 2, 3, 5, 6, 7తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. NET అర్హత సాధించడం ద్వారా JRF, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించవచ్చు.

News December 28, 2025

అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

image

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <>వీడియో<<>> రిలీజ్ చేశారు.