News January 28, 2025
ఏపీ మాజీ గవర్నర్ హరిచందన్కు అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీకి గవర్నర్గా సేవలు అందించారు.
Similar News
News January 16, 2026
ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.
News January 16, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
News January 16, 2026
225 పోస్టులకు నోటిఫికేషన్

<


