News March 21, 2024
కాంగ్రెస్లో చేరిన BRS మాజీ ఎమ్మెల్యే

TG: ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్, మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Similar News
News September 13, 2025
మీకు ‘చిన్న తిరుపతి’ తెలుసా?

AP: ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’. ఇక్కడ స్వామివారు వెంకన్న రూపంలో కొలువై ఉన్నారు. ఇది ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి సంతానానికి, మరొకటి పెళ్లి సంబంధాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు.
News September 13, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.
News September 13, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.