News March 25, 2024

ఎంపీగా మాజీ సీఎం

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రానున్నారు. బీజేపీలో ఉన్న ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ వచ్చింది. చాలా రోజుల క్రితమే ఆయన కమలం పార్టీలో చేరినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయం చేయలేదు. మరి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మాజీ సీఎం ఎంపీగా గెలుస్తారో లేదో చూడాలి.

Similar News

News April 7, 2026

చికెన్‌లో ఈ పార్టులు తినొద్దు!

image

చికెన్‌ మంచి ప్రొటీన్ ఫుడ్. అయితే ఇందులోని కొన్ని పార్టులు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు మాత్రమే ఉండే స్కిన్, బాక్టీరియా ఆవాసంగా ఉండే మెడ, తల, లంగ్స్, గిజార్డ్(కందనకాయ), కాళ్లు, తోక భాగాలను తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటివల్ల జీర్ణసంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్, వింగ్స్ మంచివని పేర్కొంటున్నారు.
#ShareIt

News April 7, 2026

IPL: ఢిల్లీకి షాక్.. మరో 3 మ్యాచ్‌లకు స్టార్క్ దూరం!

image

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో 3 మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఆయన భుజం, మోచేయి సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా బోర్డు అనుమతిస్తే ఈ నెల 21న SRHతో మ్యాచ్ నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. కాగా ఈ ఏడాది తొలి రెండు మ్యాచ్‌లను DC గెలిచిన విషయం తెలిసిందే.

News April 7, 2026

Alert: పాలిసెట్‌కు అప్లై చేసుకున్నారా?

image

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిసెట్‌-2026కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏపీలో ఈ నెల 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 25న పరీక్ష జరగనుంది. సైట్: https://polycetap.ap.gov.in/. అటు తెలంగాణలో పాలిసెట్ అప్లికేషన్ గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. మే 13న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష పూర్తైన 12 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారు. polycet.sbtet.telangana.gov.in/